Custom Search

26, ఫిబ్రవరి 2009, గురువారం

ఆయుర్వేదము అనగా ఆయువు ను గురించి చెప్పు వేదము . ఆయుర్వేదము. ప్రకృతి లో పంచభూతములు భూమి ,నీరు,ఆకాశం ,అగ్ని, వాయువు. ఈ అయిదు మీద ఆధారపడి మనము జీవించుతున్నాము. ఈ ఆయుర్వేదము కూడా ఈ పంచభూతములు మీదనే ఆధారపడి ఉన్నవి. మన శరీరము కూడా ప్రకృతి వంటిదే. ఆంటే మన శరీరము లో ఈ పంచభూతములు ఉంటాయి. ఈ అయిదు పంచబూతములు మూడు గా మన శరీరములో విభజన గా జరిగినది. అవే వాత, పిత్త, కఫము(శ్లేష్మము). అవే మన శరీరమును నిర్దేశిస్తాయి . కావున మన శరీరములో ఈ మూడిటిని మనము సమానముగా ఉంచినచో మనకు ఎట్టి రోగము రాదని ఆయుర్వేదము చెప్పుచున్నది.

19, ఫిబ్రవరి 2009, గురువారం

తెలుగు ఆయుర్వేద కు స్వాగతం . మీ అందరికి ధన్యవాదాలు . మన పవిత్ర భారత దేశము లో ఆయుర్వేదము పుట్టినది . మనకి మహర్షులు ఆయుర్వేదము గురించి చాలా వివరము గా చెప్పినారు. మన ఆయుర్వేదము ద్వారా మనము చాలా ఆరోగ్యవంతము గా ఉండవచ్చు. . ప్రస్తుతము ఇంగ్లీష్ మందులు సామాన్యుడు వాడలేక పోవుచున్నాడు. కాబట్టి ఆయుర్వేదము ను ఉపయోగించి అందరూ ఆరోగ్యముగా ఉంటారని
ఉండాలని కోరుతూ నేను సేకరించిన విషయములు మీ ముందర ఉంచుతున్నాను